ల్యాప్ టాప్ అందించి కాలేజీ ఫీజు చెల్లిస్తానని హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా విద్యార్థులకు తన వంతుగా సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సోమవారం ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేత కుటుంబానికి చెందిన అభినవ్ ఐఐటీలో సీటు సాధించడంతో కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందజేశారు. కళాశాల ఫీజు కూడా తాను చెల్లిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనీ, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విద్యార్థి అభినవ్, తల్లి దండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



