ఓఆర్‌ఆర్‌పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్‌ చేంజ్‌లు ఉన్నాయి.

Spread the love