అరుణోదయ రామారావుకు జోహార్లు.. 

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

అమరుడు కామ్రేడ్ అరుణోదయ రామారావు 5 వ వర్ధంతి సందర్బంగా ఆదివారంం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో తన చిత్ర పటానికి పులా మాల వేసి నివాళ్లు అర్పించడం జరిగిందనీ  సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన  పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామిక సంస్కృతి రంగంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రముఖుల పాత్రలో మొదటి వరుసలో నిలిచి అరుణోదయ సాంస్కృతిక సంస్థ పేరునే ఇంటిపేరుగా చేసుకొని విప్లవ శ్రేణుల్లోని కాక ప్రజలలో కూడా గుర్తింపు పొందిన అరుణోదయ రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్, సాయబు హుసేన్, గజ్జల మల్లా రెడ్డి, రామ చారి తదితరులు పాల్గొన్నారు.
Spread the love