
నవతెలంగాణ – శంకరపట్నం
ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ కోసం శంకరపట్నం మండల తహసీల్దార్ అనుపమ ఎస్సై పాకాల లక్ష్మారెడ్డికి, మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య హాజరై మాట్లాడుతూ,ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధును విజయవంతం చేయాలని శంకరపట్నం మండల కార్మిక సోదరి సోదరులకు హమాలీలకు మధ్యాహ్న భోజనం భవనిర్మానం అంగన్వాడి, ఆశ వర్కర్లు,ఆటో యూనియన్,రైతులు కూలీలు,వ్యవసాయ కార్మికులు,కార్మికులందరూ 16న మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వద్ద ఉదయం 10 గంటలకు ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అలాగే దేశవ్యాప్త ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ 44 కోడ్ లను 4 కోడ్ లుగా విభజించి కార్మికుల పొట్టను కొట్టారని పేద మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలి 60 ఏళ్లు పైబడిన అందరికీ ఫించనివ్వాలి విద్యుత్ బిల్లు 2022ను ఉపసంహరించాలి, ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజులను 200 కు పెంచాలి రోజుకు కనీస వేతనం 800 ఇవ్వాలి పెండింగ్లో ఉన్న అన్ని వేతనాలు చెల్లించాలి జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టం చేయాలి ధరల పెరుగుదలను అరికట్టాలి ఆహార వస్తువులు నిత్యవసరాల వస్తువులు పై జిఎస్టిని ఉపచారించాలి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటగ్యాసులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షులు బొజ్జ సాయిలు, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు కన్నం సదానందం,ఆటో యూనియన్ కార్మికులు దొమ్మేటి వెంకటస్వామి, కనుకం కుమార్, దేవునూరి రాజు, కుమార్,పిల్లి సంపత్,తదితరులు పాల్గొన్నారు.