సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాల అమలులో లష్కర్‌ అగ్రస్థానం

– డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావుగౌడ్‌
నవతెలంగాణ-ఓయూ
సీతాఫల్‌మండి మున్సిపల్‌ డివిజన్‌ పరిధిలో రూ.కోటీ 10 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక లాపాల ప్రారంభోత్సవాన్ని డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారా వుగౌడ్‌ శుక్రవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ సామల హేమ, బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు కిషోర్‌ కుమార్‌, అధికారులు, నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ మాట్లాడుతూ సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 50 ఏండ్లలో చేపట్టని ఎన్నో పనులను కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవ ధిలో చేపట్టామని తెలిపారు. స్థానిక పేద, మధ్య తరగ తుల విద్యార్దులకు ఉపకరించేలా హై స్కూల్‌, జూనియర్‌, డిగ్రీ కాలేజీల కొత్త భవనాల నిర్మాణాన్ని త్వరలో ప్రారం భించనున్నట్టు తెలిపారు. కుట్టి వెల్లోడి ప్రభుత్వాస్పత్రి నిర్మాణ పనులను కుడా ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని రోడ్ల పునర్నిర్మాణం, సివరేజ్‌ లైన్ల ఏర్పాటు పనులను చేపడుతున్నామని తెలిపారు. మహమ్మద్‌గూడలో రూ.8. 5 లక్షలతో సివర్‌ లైన్‌, ఏఎస్‌ ఆర్‌ హాస్పిటల్‌ సమీపంలో రూ.5 లక్షలతో సివర్‌ లైన్‌, కింది బస్తీలో రూ.18.5 లక్షలతో సివర్‌ లైన్‌, భవానినగర్‌లో రూ.8.8 లక్షలతో మంచి నీటి పైప్‌ లైన్‌, టీఆర్‌టీ క్వార్టర్స్‌ సమీపంలో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారం భించినట్టు చెప్పారు.

Spread the love