ఓపెన్ పది ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: పెద్ద కొడపగల్ మండల్ ఈ విద్యా సంవత్సరం ఓపెన్ పది ఇంటర్లలో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు చివరి అవకాశాన్ని అపరాధ రుసముతో పొడిగించినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓపెన్ స్టడీ సెంటర్ అసిస్టెంట్ కో అరిడినేటర్ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి నుండి కేవలం ఆరు నెలలోనే పది ఇంటర్ లను పూర్తిచేసుకొనే అవకాశన్నీ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలో చదువులో వెనుకబడిన మధ్యలో బడి మానేసిన 14 సంవత్సరాల వయస్సు నిండిన బాల బాలికలను ఆ గ్రామంలోని పెద్దలు యువత గుర్తించి ఓపెన్ లో చేర్చేవిదంగా కృషి చేయాలని కోరారు. పది పాసైన వారు నేరుగా ఇంటర్లో చెర్వచని తెలిపారు. వివరాలకు 9866343898 కు సంప్రదించలాని కోరారు.
Spread the love