Saturday, August 8, 2026
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

ఎన్ని సార్లు చెప్పాలి?
భర్త : ఫోన్‌ చూస్తూ వంట చేయొద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి. రసంలో చింతపండు లేదు, ఉప్పు లేదు, కారం లేదు.
భార్య : తినేటప్పుడు ఫోన్‌ చూడొద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాలి. మీరు రసం పోసుకోలేదు, అన్నంలో నీళ్లు పోసుకున్నారు.

మా ఇంటికే రావాలి…
భర్త : ఏమైందే, ఆ ఎదురింటావిడ తిట్టుకుంటూ వెళ్తుంది?
భార్య : ఏమీ లేదండి, నిన్న మన మిక్సీ పాడైపోయిందని మిక్సీజార్‌ ఒకసారి ఇవ్వమని అడిగితే మా ఇంటికి వచ్చి వేసుకోమంది. ఇవాళ నా దగ్గరకొచ్చి చీపురు అడిగింది. నేను ఇక్కడికొచ్చి ఊడ్చుకోమని చెప్పాను.

దూకలేడు.. ఎలా?
‘హలో… మా ఆయన కిటికీ లోంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు’ హౌటల్‌ గది నుంచి రిసెప్షన్‌కు ఫోన్‌ చేసింది ఓ మహిళ.
‘కంగారుపడకండి మేడమ్‌! మీ ఆయన ఆ అఘాయిత్యం చేసుకోకుండా మేం కాపాడుతాం’ భరోసా ఇచ్చాడు రిసెప్షనిస్ట్‌.
‘నేను నీకు ఫోన్‌ చేసింది కాపాడటానికి కాదురా నాయనా! కిటికీ తెరుచుకోవడం లేదేమిటని అడగడానికి’ విరుచుకుపడింది మహిళ.

అల్ప సంతోషి
మల్లేష్‌కు అల్లావుద్దీన్‌ అద్భుత దీపం దొరికింది. దాన్ని రుద్దాడు. అందులోంచి భూతం ప్రత్యక్షమైంది.
‘ఆజ్ఞపించుము ప్రభు?’ అడిగింది వినయంగా.
‘ఓ పెద్ద బంగ్లా, దాని నిండా ఫర్నీచర్‌. చుట్టూ అందమైన గార్డెన్‌. బంగ్లా ఎదుట ఎల్లప్పుడు అందుబాటులో ఉండే ఖరీదైన కార్‌..’ చెప్పుకుంటూ పోయాడు మల్లేష్‌.
‘అంతేనా… ఇంకేమైనా కోరికలు ఉన్నాయా?’ అనడిగింది భూతం.
‘ఆ బంగ్లాలో నాకు సెక్యూరిటీగార్డ్‌ ఉద్యోగం’ అన్నాడు మల్లేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -