రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన

Laying foundation stone for modernization of railway stations

– రాష్ట్రంలోని 21 స్టేషన్ల పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
నవతెలంగాణ- విలేకరులు
అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ ఆధునీకరించనున్నది. ఈ పథకం కింద తొలిదశలో రాష్ట్రంలోని 21 రైల్వే స్టేషన్లను రూ.894.09 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వర్చువల్‌లో శంకుస్థాపన చేశారు. తొలిదశ అభివృద్ధి చేసే స్టేషన్లలో.. ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, కరీంనగర్‌, జనగామ, కామారెడ్డి, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్‌ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో నియోజకవర్గ ఎంపీలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని రైల్వేస్టేషన్‌ను మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Spread the love