మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి నాయకులు

నవతెలంగాణ – తొగుట
బహుజన బిడ్డ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రని పోషించిన పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం సంతోషకరమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బుధవారం సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను తొగుట మండల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా జిల్లాకు వచ్చిన రావడంతో కాంగ్రె స్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుబ్బాక నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తొగుట మండల నాయకులను మంత్రికి పరిచయం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ జిల్లాకు చెందిన బహుజన బిడ్డకు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రని పోషించిన పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం సంతో షదయకమైన విషయం అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్ని కల్లో ఇచ్చిన వాగ్దానలను అన్నింటిని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. కొద్దీ రోజుల్లో తొగుట మండల కేంద్రంలో పర్యటిస్తాన్న మంత్రి హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అక్కం స్వామి, టీపీసీసీ ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love