బీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు

– సాదరంగా ఆహ్వానించిన మంత్రి
నవతెలంగాణ కమ్మర్ పల్లి: బాల్కొండ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం వేల్పూర్ లోని స్వగృహంలో  మంత్రి వేముల సమక్షంలో పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వేల్పూర్ మండలంలో బీజేపీ నుండి లక్కొర మాజీ ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్,బైరి సుధాకర్, అమీనాపూర్ శ్రీనివాస్ కార్యకర్తలు, జానకం పెట్ గ్రామం కాంగ్రెస్ నుండి అనంత రావు, సంతోష్, ప్రిన్స్, వంశీ, కార్యకర్తలు, మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామం నుండి  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పిట్ల బాలకిషన్, పిట్ల గణేష్, దొంకంటి దినేష్, భీంగల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గొల్ల మహేష్ మరియు కార్యకర్తలు బీజేపీ నుండి పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love