సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించండి

నవతెలంగాణ – భువనగిరి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం బ మండల పరిధిలోని నందనం, ముస్తాలపల్లి గ్రామాలలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక కూలీ భూమి పోరాటాలు కార్మికుల కర్షకుల హక్కుల కోసం అనేక సమరశీల పోరాటాలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. నిరంతరం రైతులు ప్రజలు వ్యవసాయ కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన సిపిఎం అభ్యర్థి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నదని తెలియజేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని విద్య వైద్యం ఉపాధి పరంగా ముందు భాగంలో పెట్టడానికి కృషి  చేస్తారన్నారు. ప్రజలందరూ ప్రజల పక్షాన ప్రజల మధ్యన ఉండే జహంగీర్ ని గెలిపించాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, నాయకులు కళ్లెం లక్ష్మీ నరసయ్య, భూపాల్ రెడ్డి,  లచ్చిరెడ్డి, సిద్ధిరాములు పాల్గొన్నారు.
Spread the love