తెలంగాణ సినిమాను బతికించుకుందాం…

Let's live Telangana cinema...నాటి మద్రాస్‌ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సినిమా పరిశ్రమ రావడానికి, వచ్చి ఇక్కడ స్థిరపడడానికి, అప్పటి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుం డా ఉండి ఉంటే అది సాధ్యమయ్యేదేనా? ఆంధ్రాప్రాంతానికి మద్రాసు దగ్గరగా ఉండటంవల్ల అప్పట్లో ఆంధ్ర ప్రాంతం వారు సినిమా పరిశ్రమలో అవకాశాలను దక్కించుకోగలిగారు. కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన రచయితలు, దర్శకులు అక్కడి సంస్కృతినే వెండితెరపై ఆవిష్కరించగలిగారు. ఆ సంస్కృతిలో ఇమిడే పాత్రలకు ఆ ప్రాంతానికి చెందిన నటీనటులకే ఎక్కువ అవకాశాలిచ్చారు, కాబట్టి సినిమా పరిశ్ర మలో ఆంధ్రా ప్రాంతంవారు ఎక్కువ శాతం స్థిరపడిపోయారు. అక్కడి వ్యాపారవే త్తలు నిర్మాణ రంగంలో, పంపిణీ రంగంలో దూసుకుపోయారు. తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమంది స్థిరపడ్డ తర్వాత, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, ప్రోత్సాహ కాలను, పన్ను మినహాయింపులను తొలగించేశారు. అందువల్ల, ఇక్కడ స్థిరపడ్డ వారు అంచెలంచెలుగా ఎదిగిపోయారు, అందులో కొంతమంది నిర్మాణ రంగాన్ని, పంపిణీ రంగాన్ని, థియేటర్లన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని మొత్తం సినిమా వ్యాపా రాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయారు. అప్పటి ప్రోత్సాహకాలు, రాయితీలు అలాగే కొనసాగి ఉంటే, కొత్తవారికి పరిశ్రమలో రావడానికి, వ్యాపారాన్ని పెంచుకో వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరైనా సాహసం చేసి సినిమాలు తీసినా, థియేటర్స్‌లో చోటుదక్కక మళ్లీ గుత్తాధిపతులపై ఆధారపడవలసిన పరిస్థితి నెల కొన్నది. ఆ సినిమాకు గుత్తాధిపతి సహకరిస్తే గాని అది విడుదలకు నోచుకోవడం లేదు. గతంలో ఒక సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు తీసుకొని వచ్చి నిర్మా ణానికి దోహద పడేవారు, థియేటర్‌ యజమానులు ఎంతోకొంత అడ్వాన్సులిచ్చి సినిమాను తమ థియేటర్లో విడుదల చేయుటకు అగ్రిమెంట్స్‌ చేసుకునేవారు. అలా మూ డంచెల వ్యవస్థ ఉన్నంతకాలం సినిమా పరిశ్రమలో అందరూ సమతుల్యంగా ఎదిగేవారు. ఎప్పటినుంచైతే ఈ మూడంచెల వ్యవస్థ కనుమరుగైపోయిందో అప్పటి నుండి లోబడ్జెట్‌ సినిమాలు తీయడం, విడుదల చేయడం కష్టతరం అయిపో యింది. దీంతో ఎంతోమంది సినిమాలు నిర్మించడం మానేశారు.
ఇప్పుడు ఎవరైనా కొత్తవారు సిని మాలపై కసి, మోజు ఉన్న వారు మా త్రమే రిస్క్‌ తీసుకొని సినిమాలు నిర్మి స్తున్నారు. వాటిలో అరకొర సినిమాలు సవ్యంగా విడుదలై విజయవంతం కూ డా అవుతున్నాయి. పూర్తి నిర్మాణం, ప్రింటు, పబ్లిసిటీ అన్ని నిర్మాత నెత్తిపైనే ప డుతున్నవి. ఆ సినిమా ఒక గుత్తాధిపతికి నచ్చితే అది విడుదలవుతుంది. ఆ వి డుదలైన సినిమా ప్రజలకు నచ్చితే, ఆ నిర్మాత బతికి బయట పడవచ్చు, లేకుంటే పెట్టిన పెట్టుబడి మొత్తం పోవచ్చు. ఇంత రిస్క్‌ తీసుకొని ఏ వ్యాపార వేత్త కూడా ఈ సినిమా బిజినెస్‌లో ముందుకు రాడానికి సాహసించడు. ఇది ఇప్పుడు కొన సాగుతున్న సినిమా పరిశ్రమ పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే మొట్టమొదలు టికెట్‌ రేట్లు నియంత్రించాలి, క్యూబ్‌, యు ఎఫ్‌ ఓలకు చెల్లించే డిజిటల్‌ చార్జెస్‌ తగ్గించి ఒక్కొక్క షో చొప్పున నిర్ణయించాలి. టికెట్‌ రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు రాడానికి భయపడుతున్నారు ఓటీడీలో వచ్చినప్పుడు చూద్దామని నిర్ణ యించుకుంటున్నారు. సినిమా నిర్మాణ వ్యయం అతిగా పెరిగిపోయిందనే కారణం తో టికెట్‌ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు ఈ విధంగా సినిమా పరిశ్రమ తన గొ య్యి తానే తవ్వుకుంటున్నది. టికెట్‌ రేట్లు నియంత్రిస్తే ప్రజలు థియేటర్లో ఆస్వా దించుటకు మొగ్గు చూపుతారు, లేకుంటే నెమ్మదిగా ప్రజలు థియేటర్‌కి వచ్చే అల వాటును మానుకుంటారు. డిజిటల్‌ చార్జెస్‌ షో చొప్పున తీసుకుంటే సినిమా విడు దల సమయంలో నిర్మాతకు వెసులుబాటుగా ఉంటుంది. మొట్టమొదలే వారం చొప్పున చెల్లించుకుని సినిమా ఆడినా, ఆడకున్న ఆ డబ్బులు తిరిగివ్వకుండా ఉండే సంస్కృతి ఒక రకమైన దోపిడీయే కదా! ఈ నియంత్రణ ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ తరపున తప్పనిసరిగా జరగాలి లేదా ఈ డిజిటల్‌ స్క్రీనింగ్‌ ప్రక్రియ ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ మొదలుపెట్టి, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతూ, ఆ వచ్చే ఆదాయాన్ని సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించుకోవ డానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్థిరపడ్డ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి వేగవంతంగా ప్రభుత్వం చొరవ తీసుకొని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పుడున్న పరిశ్రమకు సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సిని మా పరిశ్రమ స్థాపన అవసరం. దానికోసం ఒక ప్రత్యేక తెలంగాణ సినిమా పాలసీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. తెలంగాణ సాధనకు అన్ని రంగాలవారు కలిసి కట్టుగా పోరాటం చేశారు. ఏ మాటకామాట చెప్పాలంటే వట్టి రాజకీయ రంగానికే తెలం గాణ తెచ్చుకున్నట్టు కనపడింది. గత పదేళ్లలో అన్ని రంగాలలో కల్లా తెలంగాణ సినీ రంగంపై ఒక్క ఇంచు కూడా గత ప్రభుత్వం కదలలేదు. ప్రతిపాదించిన కొన్ని డిమాండ్లను గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ, ఈరోజు వరకు ఒక్క డిమాండ్‌ కూడా అమలు కాలేదు. పదేళ్లు వట్టి ప్రకటనలతోనే కాలయాపన చేశారు, ఒక్క అభివృద్ధి కూడా సినిమా పరిశ్రమలో జరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. మాలాంటివారు తెలంగాణ ఉద్యమం కోసం సినిమాలు తీశాము. ప్రతి పిలుపునకు కదిలి ఉద్యమంలో పాలు పంచుకున్నాము. విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించాము.ప్రత్యేక రాష్ట్రమొస్తేనైనా సినిమా పరిశ్రమ మె రుగుపడుతుందని ఆశించాము. ఏదీ జరగలేదు కాబట్టి, ఈసారి కాంగ్రెస్‌ ప్రభు త్వానికి పౌర సమాజంతో పాటు మా మద్దతు కూడా తెలిపి అధికారంలోకి వచ్చేలా కృషి చేశాము. ఈ కొత్త ప్రభుత్వం తక్షణమే కాలయాపన చేయకుండా తమను పిలిపించి, ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మా సూచనలను తీసుకొని, పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు పునాది వేస్తారని ఆశిస్తున్నాము.
ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నది కదా ఇంకొక పరిశ్రమ ఏమిటి? ఇంకా అభివృద్ధి ఏమిటనే ప్రశ్న కొంతమందికి ఉత్పన్నం అవ్వచ్చు. ఇప్పుడు స్థిరపడ్డ సినిమా పరిశ్రమ అప్పుడు స్థిరపడ్డవారితో, వారి ఆధిపత్యంలో కొనసాగుతున్నది, తెలంగాణ భూమి పుత్రులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ సాంకేతిక నిపుణు లు, తెలంగాణ నిర్మాతలు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలపై, తెలంగాణ చరిత్రపై, తెలంగాణ జీవితాలను ఆవిష్కరిస్తూ తీసే సినిమాలకు మునుపటిలాగా మళ్లీ రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇచ్చి ప్రోత్సహించడం అవసరం. అలాంటి సినిమాలకు థియేటర్లలో రెండు షోలు కేటాయించాలి. పన్ను మినహాయింపులివ్వాలి. అవార్డులూ ప్రకటించాలి. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కి పంపించాలి. అప్పుడుగాని తెలంగాణలో ఉన్న కళాసంపదకు ప్రయోజనం చేకూరు తుంది. స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కళాకారులకు సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్‌ సౌకర్యం కల్పించాలి. పూనే ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌ మాదిరిగా ఒక ఇనిస్టి ట్యూట్‌ స్థాపించాలి. మంచి కథ తయారు చేసుకుని ఉన్న యువతకు కెమెరా, ఎడిటింగ్‌ సౌకర్యాలు ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ సమకూర్చి ప్రోత్సహించాలి. తెలంగాణ వారు స్టూడియోలు నిర్మించుకోవడానికి గతంలో లాగా స్థలాలు కేటా యించాలి. సినిమా నిర్మాణానికి కొంతవరకు రుణసౌకర్యం కల్పించాలి. అప్పుడే తె లంగాణ వారు సినిమా రంగం వైపు మొగ్గు చూపించి సినిమాలు నిర్మించి, సినిమా పరిశ్రమలో అభివృద్ధి చెందగలుగుతారు. భూమి పుత్రులకు పుష్కలంగా అవకా శాలు దక్కుతాయి. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు వెండితెరపై ఆవిష్కరించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ప్రత్యామ్నాయ, సమాంతర తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ప్రపంచ వ్యాప్తిగా ఖ్యాతి దక్కుతుంది.
– సయ్యద్‌ రఫీ, 9966025325

Spread the love