స్ప్రింటర్లు చలో పారిస్‌

– మెన్స్‌, ఉమెన్స్‌ రిలే జట్ల అర్హత
న్యూఢిల్లీ:
భారత మెన్స్‌, ఉమెన్స్‌ 4ఞ400 రిలే పరుగు జట్లు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలేలో మన అథ్లెట్లు మెరుపు ప్రదర్శనతో ఈ ఘనత సాధించారు. ఉమెన్స్‌ రిలే జట్టులో రూపల్‌, పూవమ్మ, జ్యోతిక, సుభాలు 3.29.35 సెకండ్లలో రేసు ముగించి రెండో స్థానంలో నిలిచారు. జమైకా 3.28.54తో అగ్రస్థానంలో నిలిచింది. మెన్స్‌ రిలే జట్లు అనాస్‌, మొహమ్మద్‌, రాజీవ్‌, జాకబ్‌లు 3.3.23 సెకండ్లలో రేసును పూర్తి చేశారు. హీట్స్‌లో యుఎస్‌ఏ (2.59.95) తర్వాతి స్థానంలో నిలిచిన భారత జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రతి హీట్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. జులై 26-ఆగస్టు 11 వరకు పారిస్‌ వేదికగా 2024 ఒలింపిక్స్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

Spread the love