ఐక్య ఉద్యమాల ద్వారానే అధికారాన్ని సాధిద్దాం..

– బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఓబిసి రిజర్వేషన్ల సాధన సమితి కోఆర్డినేటర్ పోచ బోయిన శ్రీహరి యాదవ్ 
నవతెలంగాణ – సిద్దిపేట
ఐక్య ఉద్యమాల ద్వారానే అధికారాన్ని సాధిద్దాం అని  బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఓబిసి రిజర్వేషన్ల సాధన సమితి కోఆర్డినేటర్ పోచ బోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. సెప్టెంబర్ 24 మహాత్మ జ్యోతిరావు పూలే 1873 లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి 150 ఏళ్లు అయిన సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో సిద్దిపేట జిల్లాలోని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  బీసీ కుల సంఘాల ఆలోచనపరుల సమాలోచన సదస్సు నిర్వహించారు.
 ఓబీసీ రిజర్వేషన్ల సాధన సమితి  సమన్వయకర్త కోఆర్డినేటర్  పోచబోయిన శ్రీహరి యాదవ్  ఈ సందర్భంగా మాట్లాడుతూ  చేస్తూ బీసీ కుల సంఘాలైన మనము చేతివృత్తులు, శ్రామిక కులాలుగా, ఉత్పత్తి, సేవా కులాలుగా ఉన్న మనము విడివిడిగా ఒంటరిగా హక్కులను సాధించుకోలేమని,  ఉమ్మడిగా ఐక్యవేదిక ద్వారా ఐక్య ఉద్యమాల్ని నిర్మించడం ద్వారా మాత్రమే మన హక్కుల్ని సాధించుకోగలుగుతామని పిలుపునిచ్చారు.  సభాధ్యక్షులుగా లక్కరసు ప్రభాకర్ వర్మ, నాయకులు  మామిళ్ల ఐలయ్య యాదవ్, కోరే ఎల్లయ్య కురుమ, తుమ్మల శ్రీనివాసు,బొంపల్లి శ్రీహరి, దరిపల్లి శ్రీనివాసు,నాయక మల్లయ్య, అగుళ్ల శంకర్,బూర మల్లేశం, గడ్డం వెంకటయ్య, కోత్వాల్ నరేందర్,  ఆకుల ప్రశాంత్, బోయ రాములు మాట్లాడుతూ.. 78,79వ రాజ్యాంగ సవరణ ద్వారానే స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు హక్కులు  సాధించుకున్నప్పుడుఅమలు జరిగినప్పుడు,128 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన మహిళా రిజర్వేషన్ బిల్లులో వాటా కేటాయించకపోవడం రాజ్యాంగ స్పూర్తికి విఘాదం కలిగించడమేనన్నారు.  జనగణన చేపట్టకుండా జనగణన లో కులగణనను చేర్చకుండా లెక్కలు సరిగా లేవనే పేరుతో దశాబ్దాల తరబడి బీసీలకు జరుగుతున్న మోసాన్ని ఎదిరిద్దామన్నారు.  తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల  రాజ్యలక్ష్మి , ఈజీఎస్ కౌన్సిల్ మెంబర్    సద్గుణ , మాజీ మిడిదొడ్డి ఎంపీపీ పంజాల కవిత గౌడ్ , పయ్యావుల పూర్ణిమ ఎల్లం , దాసరి భాగ్య శ్రీనివాస్ యాదవ్ , పాతుకుల లీలాదేవి వెంకటేష్ యాదవ్ మాట్లాడారు. భాగస్వామ్య సంస్థల నాయకులు అందరూ  తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అంతిమంగా ఐక్య ఉద్యమం ద్వారా మాత్రమే మన లక్ష్యాన్ని సాధించుకుందామని, భవిష్యత్తులో ఈ వేదిక సిద్దిపేట కేంద్రంగా ప్రారంభమై మొత్తం లక్ష్యాన్ని సాధించే వరకు ముందుకు సాగాలని మేమంతా భాగస్వామ్యం అవుతామని ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళల కోటా తేల్చాలని, రెండో తీర్మానంగా జాతీయ జనగణన చేపట్టి అందులో కులగణన చేర్చాలని, మూడో తీర్మానంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లను కూడా ఆమోదిస్తూ వెంటనే చట్టం చేయాలని తీర్మానించారు.  భవిష్యత్తులో సంస్థ చేపట్టబోయే ఏ కార్యక్రమంలోనైనా అందరం పాల్గొంటామని తీర్మానం చేశారు.
Spread the love