- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు*
నవతెలంగాణ-బొమ్మల రామారం: HCUలో క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, విద్యార్థులపై దాడికి పాల్పడిన ABVP కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు అన్నారు… శుక్రవారం బొమ్మలరామారం మండలంలోని తుంకుంట చౌరస్తా నలంద హైస్కూల్లో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషల్ది లక్ష్యాల కలిగిన జెండాను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటం నివాళులర్పించి శిక్షణ తరగతులు ప్రారంభించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు క్లాస్ను కల్లూరి మల్లేశం ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బోధించడం జరిగింది, అనంతరం ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి విద్యార్థులపై ఏబీపీ గుండాల దాడిని నిరసిస్తూ, ఏబీవీపీ గుండాల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. థియేటర్ విభాగానికి చెందిన విద్యార్థులు తమ అకడమిక్ మూల్యాంకనంలో భాగంగా ప్రదర్శించిన “హోలీ” నాటకాన్ని అడ్డుకునేందుకు ABVP కార్యకర్తలు చేసిన దాడి, క్యాంపస్ ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడిగా భావిస్తుంది, మే 3న నాటకం ప్రదర్శన అనంతరం కొందరు ABVP కార్యకర్తలు ఆల్లర్లు సృష్టించి, విద్యార్థులను బెదిరించడం, తదుపరి రోజు ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించడం అత్యంత దుర్మార్గమైన చర్య. మే 4న పెద్ద ఎత్తున విద్యార్థులు నాటకాన్ని వీక్షించేందుకు హాజరైన సమయంలో, ముందస్తు ప్రణాళికతో వచ్చిన ABVP గుంపులు హాల్పై దాడి చేసి, బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో హింసకు దిగడం తీవ్రంగా ఖండనీయం.
ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడగా, SFI నాయకులు కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.,అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఎన్నికైన విద్యార్థి యూనియన్ సభ్యులే ఈ దాడులకు నాయకత్వం వహించడం. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారు, గుండాగిరీకి పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. “గోలి మారో సాలోన్ కో” వంటి హింసాత్మక నినాదాలు చేయడం, విద్యార్థులు మరియు అధ్యాపకులను బెదిరించడం అసహ్యకరమైన చర్య, ఒక అకడమిక్ కార్యక్రమాన్ని “మతభావాలను దెబ్బతీస్తోంది” అనే పేరుతో అడ్డుకోవడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి అన్నారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ జగన్ నాయక్, హిందురాణి, పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు మైసూర్లో నరేందర్, లావుడియా వెంకటేష్,ప్రసన్న,నాయకులు సాయి,రవి,చరణ్,అరుణ,తరుణ్,అన్విత్ తదితరులు పాల్గొన్నారు.



