Friday, May 8, 2026
E-PAPER
Homeజిల్లాలునిరుద్యోగుల పాలిట ఆశాదీపం కుంభం ఫౌండేషన్

నిరుద్యోగుల పాలిట ఆశాదీపం కుంభం ఫౌండేషన్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి: కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థ సహకారంతో నిర్వహించారు. జాబ్ మేళా కార్యక్రమంలో కుంభం పౌండేషన్ చైర్మన్ కీర్తి రెడ్డిని పోత్నక్ ప్రమోద్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజవర్గంలో ఉన్న విద్యార్థులు యువకులు నిరుద్యోగులు కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 2000 మంది యువతీ యువకులు పాల్గొని వాళ్లకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకొని సుమారు 20 కంపెనీలతో ఈ నెల 10వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలలో విద్యార్థుల యువకులు నిరుద్యోగుల కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వాళ్ళ విద్యా అర్హతల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ఈ ప్రాంతంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థుల కోసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం ఈ జాబ్ మేళా ఎంతో సువర్ణ అవకాశంగా ఉపయోగపడుతుందని అన్నారు. న్యూ డైమెన్షన్స్ హై స్కూల్లో భారీ ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం వాళ్ళ స్కిల్స్ ను పలు కంపెనీల ముందట విద్యార్హత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు.

జాబ్ మేళా కోసం వచ్చిన నిరుద్యోగులు యువకులు విద్యార్థుల తల్లిదండ్రులకు భోజనాలు మంచినీటి వసతి అనేక మౌలిక వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కౌన్సిలర్ లయిక్ అహ్మద్ మదర్ పాషా బబ్లు పడిగేల ప్రదీప్ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాటూరు బాలేశ్వర్ పిట్టల బాలరాజ్ వస్తువుల స్థాయి పుట్ట శివ సందీప్ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -