
పాఠశాలలు పున ప్రారంభమయ్యే లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి లో వేగం పెంచాలని మండల విద్యాశాఖ అధికారి రాము DEE(R&B) రాజేంద్రా లు అన్నారు మండలంలోని పడమటి గడ్డ తండా కుంట తండా దూప తండా కొత్తూరు తండా ఎర్రబెల్లి గూడెం కాచికల్లు రేగడి తండా వరం బండ తండా రామన్నగూడెం గ్రామాల్లోని పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు తాగునీటి వసతి మరుగుదొడ్ల నిర్మాణం విద్యుత్ సౌకర్యం తదితర పనులు ఎంత మేరకు పూర్తయ్యాయో తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 31 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు జరుగుతున్నాయని తెలిపారు పాఠశాలలు పునః ప్రారంభమయ్యే లోపు అన్ని పాఠశాలల్లో పనులు 100% పూర్తవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఈ AEE(R&B) రాజు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కాపురి సుధాకర్ సిఆర్పి బి కవిత తదితరులు పాల్గొన్నారు.