నవ తెలంగాణ- భీంగల్: వడ్డెర హక్కుల సాధనకై ప్రతి సభ్యుడు ఉద్యమించాలని వడ్డెర సంఘం నాయకుడు సురేష్ తెలిపారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఎల్ జె ఫంక్షన్ హాల్ లో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా వడ్డెర కులస్తులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర కులస్తులు దుర్బర పరిస్ధితులను ఎదుర్కొంటున్నారని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెర కులాన్ని ఎస్టి జాబితాలో చేర్చాలని అలాగే వడ్డెర కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. వడ్డెరలు చైతన్యవంతులై, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగల్సిన అవసరం ఉందని ఇందుకు అందరూ కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రం, భాస్కర్, అంజయ్య, రాజు, నరేష్, పులి, కుమార్, రాములు, గణేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.