– హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్‌గౌడ్
– యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్‌ను హైదరాబాద్ రేంజ్ జైళ్లశాఖ డీఐజీ శ్రీనువాస్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ వారి కార్యాలయాల్లో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజం కోసం యువతరాన్ని ఏకం చేసే దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందుకు నడవాలన్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకు నడవడం అభినందనీయమన్నారు. అవినీతిని ప్రశ్నించడమే కాకుండా, నిజాయితీని బతికించాలనే ఆలోచనతో సమాజంలోని వివిధ రంగాల్లో పని చేసిన, పని చేస్తున్న అధికారులను గుర్తించి నేటి యువతరానికి పరిచయం చేయడం వల్ల, మంచి ఆలోచన గల యువత తయారవుతున్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ముందుకు నడుస్తామని, సమాచార హక్కు చట్టంపై సామాన్యుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహాదారులు, రాష్ట్ర కార్యదర్శి కొన్నె దేవేందర్, జాతీయ కార్గవర్గ సభ్యులు కొమటి రమేశ్ బాబు, చెరుకూరి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.