దేవుడికి ప్రాణప్రతిష్ట-దేశానికే అప్రతిష్ట

‘సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణప్రతిష్ట చేయడ మేంటో? పిచ్చిగానీ-సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశించాలి కదా? ఒక తుచ్ఛ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ట చేయడమేమిటీ?’ -అని సామా న్యులు ఆలోచనలో పడుతుంటారు. ”మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలు, సిక్కు లు, హిందువులు, క్రైస్తవుల వంటి వారందరిదీ- ఒకరకంగా భారతీయులందరిదీ. దీని కోసం అన్ని మతాల వారు వారి మత తత్వ దృక్పధాన్ని అధి గమించి, నిజమైన సమైక్య జాతీయవాద మనస్త త్వాన్ని అలవరుచుకోవాలి!”- అని పిలుపునిచ్చిన సుభాస్‌చంద్రబోస్‌ మాటలు ఈ దేశ ప్రజల మెదళ్లలో తాజాగా కదలాడుతూనే ఉన్నాయి.
పూల్వామా, బాలాకోట్‌లు గత ఎన్నికలకు ఉప యోగపడ్డట్టు, అయోధ్య రామాలయ ప్రారంభో త్సవం రాబోయే ఎన్నికలకు ఉపయోగపడాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ఉద్దేశం. మత రాజకీయాలు చేస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం అధి కారికంగా అయోధ్యరాముడికి ప్రాణప్రతిష్ట చేస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా ఒక సెక్యులర్‌ దేశ ప్రధాని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాముడికి ప్రాణప్రతిష్ట చేయడాన్ని ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ నిరసిస్తోంది. దేశంలోని అన్ని పీఠాల శంక రాచార్యులంతా తమకు పంపిన ఆహ్వానాల్ని తిప్పికొట్టారు. రా ముడి స్థాయి తగ్గించి మోడీ తన స్థాయి పెంచుకుంటున్నాడని దూషించారు. అసలు అతనికి ఆ అర్హతే లేదని ఆగ్రహించారు. నిర్మాణదశలో ఉన్న ఆలయంలో రాముడికి ప్రాణప్రతిష్ట చేయడ మేమిటని దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాలుగు పీఠాల శంకరాచార్యులు హిందూ విరోధులా? ఆహ్వానం తిరస్క రించినా అగ్రనాయకులెవరూ నోరు మెదపడం లేదెందుకూ?- అమిత్‌ షా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి ఆయో ధ్య రామాలయానికి రావాలని ఆహ్వానాలు, అక్షింతలు పంచి పెడుతున్నారు. ఆ ఆహ్వానం మూడు నెలల్లో ఎప్పుడైనా ఉపయో గించుకోవచ్చని అందులో ఒక సూచన కూడా ఉంది. ప్రాణ ప్రతి ష్టకు ముహూర్తం ఏ పండితుడో నిర్ణయించింది కాదనీ, రాబో యే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు నిర్ణ యించిందేనని- పలువురు ఆధ్యాత్మికవేత్తలు దుయ్యబట్టారు.
ఆలయాలకు రమ్మని ఎవరూ ఎవరినీ ఆహ్వానించరు. అది వ్యక్తిగత విషయం ఎవరికి వారు నిర్ణయించు కోవాల్సింది. దేవు డికీ, భక్తులకు మధ్య కేంద్ర ప్రభుత్వం బ్రోకర్‌పని నెత్తిన వేసు కుందా? అయినా ఒక మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులూ, అధికారాలు బలవంతంగా లాగేసుకుంటుందా? ఈ గుత్తాధిపత్యం చాలా అసహ్యంగా, ఎబ్బెట్టుగా కూడా ఉంది. అధికార పార్టీకి మీడియా సంస్థలు తమ హద్దులు దాటి మద్దతిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో హిందీ పత్రికలు టెలివిజన్‌ ఛా నళ్లు విపరీత ధోరణిలో పని చేస్తున్నాయి. తమ వ్యాన్‌ల మీద ‘మందిర్‌ వహీ బనాయా హై’ – అని పెద్ద అక్షరాలతో రాసుకున్నాయి. కోర్టు ఆర్డరు ఉన్నా లెక్క చేయకుండా మందిరం అక్కడే కట్టారు-అని ధైర్యంగా ప్రచారం చేస్తున్నాయి. మోడీ బొమ్మతో ‘వన్‌ నేషన్‌ వన్‌ లీడర్‌’ – అని మరో హిందీ దిన పత్రిక పోస్టర్లు వేసింది. ‘రామ్‌ ఆయెంగే’ అని ఒక హిందీ ఛానెల్‌ ప్రకటిస్తే, ‘శ్రీ రామోత్సవ్‌- పేరుతో ఒక మీడియా సంస్థ వేడుక జరిపింది. దానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి హాజరయ్యాడు. ఈ రకంగా దేశంలో మీడియా ప్రజాస్వామ్య విలువల్ని కాల్చి బుగ్గిచేస్తోంది. ఒక రకంగా దేశంలో పత్రికా రంగపు అధర్మ కాలం నడుస్తోంది.
ఇవన్నీ కాక, ఒకప్పుడు బాబ్రీ మసీదు కూలగొట్టిన కరసేవ కుల (నేరగాళ్ల) ఇళ్లు వెతికి వెతికి వారికి పూలదండలు వేసి బహి రంగ స్థలాలలో సన్మానిస్తున్నారు. ఈ పని ఇంకెవరు చేయ గలరూ? ఆరెస్సెస్‌ – బీజేపీ కార్యకర్తలే ! ఇది ఇలాగే కొనసాగితే మనుస్మృతిని భారత రాజ్యాంగం స్థానంలో ప్రతిష్టించరనీ- సనాతన ధర్మాన్ని తిరగతోడరనీ నమ్మకమేమిటీ? దేశంలో కమలం ఒక విషపుష్పంగా, విద్వేష పుష్పంగా చరిత్రలో నిలబ డుతుంది. అనుమానమే లేదు. ఇప్పుడు బీజేపీ వారు వారి పార్టీ ఫుల్‌ఫాం మార్చుకున్నారు. బి-అంటే బాయిస్‌ (22) జె- అంటే జనవరి పి-అంటే ప్రాణ-ప్రతిష్ట-అని! ఇదే రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన శంకరాచార్యులు 1. నిర్మలా నంద సరస్వతి. 2. భారతీ కృష్ణ. 3. అభిముక్తేశ్వరానంద్‌. 4. సదా నంద్‌ మహరాజా-నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభిస్తు న్నారంటే- అది ఎన్నికల స్టంటేనన్నది వీరంతా ముక్తకంఠంతో ఘోషించారు. అయినా ఏ దేవుడు ఎవడికి కలలో వచ్చినా తనకు గుడి కట్టమని దేబరిస్తాడెందుకో? ఓ బడి, ఓ ఆసుపత్రి – లేదా ప్రజలకు ఉపయోగపడేది మరేదైనా కట్టించమని అడగడెందు కూ అని మనతోటి సగటు మనుషులకు అనుమానాలు వస్తుం టాయి. ఒక రోమన్‌ చక్రవర్తి మార్కస్‌ అరీలియస్‌ ఆంటోనిసన్‌ ఇలా అన్నాడు. ”కాంతిని ఏది ప్రసరింపజేయలేదో అది తన చీక టిని తనే సృష్టించుకుంటుంది-” ఇది కేంద్ర పాలకులకు సరి పోయే విధంగా లేదూ? ఉదాహరణకు గోవాలోని బీజేపీ సర్కార్‌ అక్కడి ప్రజలకు గొప్ప చీకటిని ఇలా ప్రసరించింది.- ”మంచి పంటల కోసం ప్రతి రోజూ పొలాల్లో వేద మంత్రాలు చద వండి!”-అని న్యూఢిల్లీలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అనే గొప్ప కేంద్ర ప్రభుత్వ సంస్థ పని చేస్తోంది. ఇంకా దాన్నెందుకు ఉంచారూ? మూసెయ్యాలి కదా? ”ఇరవై ఒకటవ శతాబ్డపు విద్యావిహీనులు ఎవరంటే చదవడం. రాయడం రాని వారు కాదు- అవి వచ్చినా, లాభం లేని మందమతులు- కాలంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోని వారు. పనికిరాని పాత విషయాలు వదిలేయని వారు. కేవలం మూఢత్వంలో బిగుసుకు పోయిన వారు” – అన్నాడు అల్విన్‌ టోప్లర్‌. అమెరికా రచయిత. ప్యూచర్‌ షాక్‌, ద ధర్డ్‌ వేవ్‌, పవర్‌ షిఫ్ట్‌ గ్రంథాల రచయిత. టోప్లర్‌ ప్రకారం విద్యా విహీనులకున్న నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది.
కరోనా వైరస్‌ను పారదోలడానికి చప్పట్లు చరచాలనీ, గంటెలతో కంచాలు మోగించాలని సూచించిన ఇదే ప్రభుత్వ పెద్దలు తాజాగా ఇప్పుడు జనవరి 22న ప్రతి ఇంటా రామ జ్యో తులు వెలిగించాలని దేశ ప్రజలకు సూచించారు. వాళ్ల మూర్ఖ త్వాన్ని దేశ ప్రజలందరికీ పంచి పెట్టాలన్నది వారి ప్రయత్నమన్న మాట! ఇందులో కొత్తవి నేర్చుకున్నదీ పాతవి వదిలేసిందీ ఎక్క డుందీ? ఇటీవల ఒక బీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ ఏమన్నారో చూడండి! ”క్షత్రియులను క్షత్రియులంటే బాధపడరు. బ్రాహ్మ ణులను బ్రాహ్మణులంటే బాధపడరు. వైశ్యుల్ని వైశ్యులంటే కలత చెందరు. కానీ శూద్రుల్ని శూద్రులంటే మాత్రం బాధప డతారు. ఎందుకో తెలుసా? వారు అజ్ఞానులు. సమాజ వ్యవస్థ కోసం ప్రాచీన హిందూ గ్రంథాల్లో నాలుగు కులాలనే ఏర్పాటు చేశారు”- ప్రజ్ఞా టాగూర్‌. మనుషులంతా ఒక్కటి అనే విషయం గ్రహించని వారిని మేం మూర్ఖులు-అని అంటాం. భారతదేశ స్వాతంత్య్రంలో పాల్గొనని వారిని దేశ ద్రోహులంటాం-మరి ఆరె ప్సెస్‌, బీజేపీ వర్గాలెందుకు ఉలిక్కి పడతాయీ? ప్రాచీన హిం దూ గ్రంథాలేమైనా జ్ఞానాన్ని పంచే వైజ్ఞానికి గ్రంథాలా? కాదు గదా? అలా అని మీరనుకుంటే అది మీ ఇష్టం. అందరూ ఒప్పు కోవాలని అనుకోకండి. 21 శతాబ్దంలో బతుకుతూ అన్ని ఆధు నిక వసతులు అనుభవిస్తూ ఇంకా వేల ఏళ్ల నాటి మైండ్‌ సెట్‌తో మాట్లాడుతాం. మేం అలాగే ప్రవర్తిస్తాం – అంటే వీలుకాదు. వారు ఏ హోదాలో ఉన్నా మా లెక్క ప్రకారం మూర్ఖుల కేటగిరి లోకే వస్తారు. పొరపాటున ఎవరైనా వీరి వలలో పడ్డారంటే వారు. వారి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారు. ఇటీవల వీరు ఆవు పేడ ఇంధనంగా నడిచే బస్సుల గురించి ప్రచారం చేశారు. ఆవు పేడతో నడిచే ఆ బస్సులు, ఒక రూపాయి ఖర్చుతో పదిహేను కిలోమీటర్లు పోగలవన్నది. ఆ ప్రకటన సారాంశం! అందుకే కాబోలు మోడీ భక్తులంతా అన్నాలు మానేసి ఆవు మూత్రం ఆవు పేడల మీద ఆధారపడి శక్తివంతులవుతున్నారూ??
బీజేపీ యం.పి ప్రజ్ఞాటాకూర్‌ ప్రకటనకు స్పందించి క్షత్రి యుడైన పరిశోధకుడు డాక్టర్‌ సంగ్రాం పాటిల్‌ ఇలా వివరణ ఇచ్చాడు-క్షత్రియులనబడే వారు హిందువులుకారని వారు శ్రమ ణులనీ అన్నాడు. వారెప్పుడూ బ్రాహ్మ ణిజాన్ని నెత్తిన మోయ లేదని-అయితే మొఘలుల కాలంలో ముస్లిం రాజులు అందరినీ ఒకేవిధంగా ‘హిందువులు”-అని అన్నారని దాన్నే తర్వాత కాలం లో బ్రిటీష్‌ వారు కొనసాగించారని అన్నాడు. బ్రాహ్మణ వర్గీ యులు కూడా పాలకుల మాటను అంగీకరించి తామంతా హిం దువులమే అని అనడం ప్రారంభించారట. ఎందుకంటే తమ సంఖ్య పెద్దది. సమాజంలో తాము అధిక సంఖ్యాకులం అని చెప్పుకోవడానికి అలా కలుపుకున్నారట. మళ్ళీ అందరికీ సమాన స్థాయి లేకుండా అందులోనే నిచ్చెనమెట్ల వ్యవస్థను సృష్టించి జ నాన్ని విభజించారట. అసలైతే అందరూ ఈ దేశ మూల వాసులు. మూలవాసుల్ని బానిసలుగా మార్చింది. ఇరాన్‌ ప్రాం తం నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు. విషయాలు లోతుగా తెలుసుకుంటే కళ్లు తెరుచుకుంటాయి. తామే ఉన్నత వర్గీయులమని శతాబ్దాలుగా ఏ పనీ చేయకుండా పరాన్నజీవు లుగా బతుకుతున్నదీ-తమ మనుగడ కోసం మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తున్నది. బ్రాహ్మ ణార్యులే అన్నది స్పష్టం! 12వ శతాబ్దం వరకు అసలు ‘హిందూ’ అనే శబ్దమే మన పూర్వీకులకు తెలి యదు. రాజ్‌పుట్‌, ఠాకూర్‌ వంటి నవక్షత్రియ శాఖలు తర్వాత కాలంలో ఏర్పడ్డాయట. ఇప్పుడు ”హిందూత్వ” పేరుతో అదే బ్రాహ్మణ వాదం దేశంలో పెత్తనం కొనసాగిస్తుందని అన్నారు డా|| సంగ్రాం.
ఆలోచనా విధానంలో తేడాలు ఎలా ఉంటాయో ఇద్దరు నాయకుల అభిప్రాయాలు గమనిద్దాం! స్త్రీల పట్ల ఆరెస్సెస్‌ వారి దృక్పథమేమిటో వారి చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తెలియజేశారు. ”ఇల్లాలు కేవలం ఇంటి పనులకోసమే, ఆమె భర్తను అన్ని విధా లా సుఖపెట్టాలి. అయితే ఆమె అవసరాలు భర్త తీర్చాలి. ఇదే సామాజిక ఒప్పందం! దీనికి కట్టుబడి ఉన్నంతవరకే కాపురం ఉంటుంది. ఉల్లంఘిస్తే భర్త – భార్యను విడిచిపెట్టొచ్చు”-అని చెప్పాడు. ఇందులో యజమాని -బానిసల సంబంధం ఉందే గాని, జీవిత భాగస్వాముల అనుబంధం ఎక్కడ ఉందీ? అయితే మరి, యశోదాబెన్‌ ఏ విషయాలు ఉల్లంఘించిందో, ఆమెను ఆమె భర్త అనధికారికంగా ఎందుకు విడిచిపెట్టాడో చెప్పాల్సిన బాధ్యత మోహన్‌భగవత్‌కు లేదా? ఇక పుచ్చలపల్లి సుందరయ్య యువతీ యువకులకు ఇలా సలహా ఇచ్చారు”.- భార్యాభర్తలి ద్దరూ ఉద్యోగాలలో, వృత్తులలో చేరితే బిడ్డల పోషణ, సంరక్షణ, ఇంటి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ, ఇద్ద రూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ-ఇరువురూ ఆ పనులన్నింటినీ పంచుకుని ఓపికగా చేసుకోవాలి. తమ స్త్రీల మీ ద బరువు తగ్గించాలనే ధోరణి పురుషులలో, ముఖ్యంగా యువ కులలో రావాలి” -అని అన్నారు. అర్థవంతమైన సూచన కదా?
– సుప్రసిద్ధ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love