జీవన నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యం, మార్గదర్శక శిక్షణ కార్యక్రమం 

నవతెలంగాణ – కంటేశ్వర్
మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడవో పథకంలో భాగంగా జీవన నైపుణ్యాలు మానసిక ఆరోగ్యం మార్గదర్శక శిక్షణ కార్యక్రమం నిజాంబాద్ అర్బన్ ప్రాజెక్ట్  పరిధిలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ & జూనియర్ కాలేజ్  నందు గల విద్యార్థినిలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏ.ఆర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ,సైకాలజిస్ట్ టీ. శిరీష విచ్చేసి విద్యార్థినిలకు జీవన నైపుణ్యాల గురించి మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి వివిధ ఆక్టివిటీస్ ద్వారా వారి స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పరీక్ష సమయంలో నేర్చుకున్న దానిని ఎలా ప్రజెంట్ చేయాలి,అనే విషయాల గురించి, సెల్ఫ్ అవేర్నెస్  కమ్యూనికేషన్ స్కిల్స్ లో మి టూ మి, మి టూ అదర్స్ , వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ల గురించి పరీక్ష పర్వ్ గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  డిహెచ్ ఈ డబ్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసీ పుష్ప గారు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఫెభా క్రిస్టినా  సిబ్బంది, విద్యార్థినిలు 320మంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love