నవతెలంగాణ:రెంజల్ : రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని ప్రధాన కూడలిలో నీటి తొట్టిని ఏర్పాటు చేయడం, పశువుల దాహం తీర్చడానికి ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి గ్రామంలో నీటి తొట్టిలను ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా మారినప్పటికీ, బోర్గం గ్రామంలో మాత్రం గ్రామంలోని పశువులన్నీ ఇక్కడ దాహం తీర్చుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతి గ్రామంలో ప్రధాన కూడలిలో నీటి తొట్టిలను ఏర్పాటు చేసినట్లయితే పశువులకు దాహం తీర్చడానికి ఎంతో ఉపకరిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.