చీటకోడూర్ రిజర్వాయర్ సమీపంలో విషాద ఘటన
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లా చీటకోడూర్ రిజర్వాయర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం తో సమస్యను గుర్తించి పరిష్కరించే క్రమంలో లైన్‌మెన్ రాధమల్ల కరుణాకర్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి లైన్ పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కరుణాకర్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర విద్యుత్ శాఖ ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



