అక్టోబర్‌ విప్లవాల సాహిత్య ధార

October revolutions literary streamఆనాటి అరుణారుణ విజయాల జ్ఞాపకాలు, గాయాల గురుతులు, త్యాగాల ఆనవాళ్లను ఆలపిస్తూ ఆగమించే విప్లవాల అక్టోబర్‌ ఎప్పుడూ వినూత్నమే. నేటి కర్తవ్యాల, రేపటి మజి లీల, అంతిమ గమ్యాల నెమరువేతకు సమాయ త్తమయ్యే సంద ర్భమే. అక్టోబర్‌ విప్లవం గురించి ప్రస్తావించుకోగానే మొదట గుర్తుకొచ్చేది సోవియట్‌ సాహిత్యమే. ‘ప్రగతి’, ‘రాదుగ’ ప్రచురణాలయాల నుంచి వెలువడిన అనువాదాల పరం పర తెలుగు సమాజంపై, సాహి త్యంపై చూపిన ప్రభావం అపారమైంది. ఇవాళ సోవి యట్‌ రష్యా అంతర్థానమై ఉండొచ్చు. కానీ ఆ సాహిత్యపు వెలుగుల ప్రభావం ఏదో రూపాన తెలుగు నేలపై నిలిచే వుంది.
పెట్టుబడిదారీ విధానానికి, ఒక మనిషిని మరో మనిషి దోచుకునే వేల ఏండ్ల పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది అక్టోబర్‌ విప్లవం(నవంబర్‌ 7) దోపిడీ పీడనలు లేని సమసమాజం ఆదర్శవాద స్వప్నం కాదని రుజువు చేసింది. అందుకు ఆచరణాత్మక మార్గమైంది. ఖండఖండాలలో కార్మికవర్గ, కమ్యూనిస్టు ఉద్యమా లకు ఊపిరులూదింది. సోషలిజాన్ని ఆవిష్కరించింది. అత్యంత నిర్బంధం మధ్య సాహసో పేత కార్మికవర్గ పోరాటానికి తోడుగా తొలిసంతకం చేసింది’అమ్మ’ నవల.
రష్యాలో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడగట్టిన కొడుకు పావెల్‌ పోరాటంలో అమ్మ భాగం అవుతుంది. పోలీసు జులుంకు వెరవక ఎర్ర జెండాను దించకుండా పోరాడుతున్న కొడుకు పావెల్‌ను వెన్నంటే ఉంది. పావెల్‌ చేజారిన జెండాను ఎత్తిపట్టి జనం మధ్య నిలిచి కార్మికులనుద్దేశించి ”నాయనలారా వినండి! మన రక్తంలో రక్తమైన పిల్లలు, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు. మీకందరికీ, మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు. సత్యమూ, న్యాయమూగల మరొక జీవన విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. జనానికందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు” అన్న ఆమె మాటలు నేటికి కర్తవ్యబోధ చేస్తూనే ఉంటాయి.
విప్లవకారులను కన్న నిజమైన తల్లుల జీవితాలన్నీ గుండెలను పిండిచేసే మహౌన్నత కావ్యాలే. అందుకే ”అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు” అని అంటారు శివసాగర్‌. మహాశ్వేతా దేవి ‘ఒక తల్లి’ పోలీసులు కాల్చి చంపిన తన బిడ్డ మరణానికి కారణాలను వెతుక్కుంటూ వెళ్లిన ఎందరో అమ్మలను జ్ఞప్తికి తెస్తుంది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లనెదిరించి, యూని యన్‌ సైన్యాన్ని ధిక్కరించి నడిపిన పోరాటంలో ఎందరో తల్లుల గుండె చెదిరే త్యాగా లున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమా తలెందరో. తమ బిడ్డలు ఎక్కడున్నారో, ఏమైపోయారో కూడా తెలియకుండా ఏళ్ళు, దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న తల్లులను కూడా ఉద్యమం మనకి అనుభవం లోకి తెచ్చింది. ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డల ప్రాణ త్యాగాలను ప్రోత్స హించిన వారు కొందరైతే, బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు.
తల్లుల పోరాట పటిమ ముందు అన్నీ దిగదుడుపే. దొరల పెత్తనానికీ, పోలీ సుల దాష్టీకాలకూ చరమ గీతం పాడుతూ ప్రతి తల్లీ ఆనాడొక చైతన్యకెరటమ య్యింది. ఊరిదొరల ఆట కట్టించే ఉప్పెనయ్యింది. చంటి బిడ్డలను వదిలేసి చంకన తుపాకులనెత్తుకున్న తల్లులెందరో. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైన ఒక్కో తల్లిదీ ఒక్కో విలక్షణమైన అనుభవం. ఐలమ్మ మొదలుకొని ఎందరో తల్లులు ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం నాటి మహత్తర తెలంగాణ పోరాటంలో సమిధలుగా మారారు. లాఠీలకూ, తూటాలకూ, నిర్బంధాలకూ వెరువని ఆ తల్లులే నిన్న, నేడు, రేపూ విప్లవోద్యమానికి వెన్నెముక.
మార్క్సిజం, లెనినిజానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలు, మిహయిల్‌ షోలోకోవ్‌ కథలు, టాల్‌స్టారు యుద్ధమూ-శాంతీ, శ్రీశ్రీ తెలుగు చేసిన మయకోవ్‌స్కీ ‘లెనిన్‌’ కావ్యం. దోస్త్‌యేవస్కీ రచించిన ‘నేరము-శిక్ష’, ‘పేదజనం శ్వేతరాత్రులు’ వంటి పుస్తకా ల్లోని సజనశక్తి అనుపమానమైంది. ఇలా 1990 వరకు సోవియట్‌ సాహిత్యం తెలుగు సాహితీ ప్రపంచాన్ని, పాఠకలోకాన్ని ఒక ఊపు ఊపింది. ఒక పుస్తకం తరువాత మరో పుస్తకం చదవాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల కోసం వచ్చే సోవియట్‌ పుస్తకాల్ని పెద్దలు కూడా ఇష్టపడ్డారు. చిన్నకథలో ఎన్నో పెద్ద సంగతుల్ని సునాయసంగా చెప్పే సుగుణం వాటిలో ఇమిడి వుండేది. మంచి అనువాదకులు అందించి సోవియట్‌ సాహి త్యం చదవడం వల్ల మన భాష కూడా మెరుగవుతుంది. అందుకే సాహిత్యరంగంలో, మీడియాలో పనిచేస్తున్నవారు సోవియట్‌ సాహిత్యాన్ని ప్రత్యేకించి చదవాలి. ఒకతరం తెలుగువారు సమాదరించిన సోవియట్‌ సాహిత్యాన్ని చదవడం ఈతరం తెలుగు పాఠకులకు చక్కని అనుభవం.

Spread the love