హైదరాబాద్ లో కుప్పలుగా అపార్ట్ మెంట్లు..

నవతెలంగాణ – హైదరాబాద్:  రియల్ ఎస్టేట్ రంగం గత కొన్నేళ్లుగా జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నగరంలో ఎకరం ధర అత్యధికంగా వంద కోట్ల రూపాయలు పలికి రికార్డు బద్దలు కొట్టింది. మరోవైపు నరగంలో సొంతిల్లు సామాన్యుడికి కలలా మారింది. ఇళ్లు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. నగరం నలుమూలలా భారీ వెంచర్లు ఏర్పాటై విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మితం అవుతున్నాయి. కానీ, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు గిరాకీ భారీగా తగ్గింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 5.26 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోలేదు. అందులో హైదరాబాద్‌ వాటా 99,989 ప్లాట్లుగా ఉండటం గమనార్హం. ఇలా కట్టి సిద్ధంగా ఉన్న అపార్ట్‌ మెంట్లలో అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్ల సంఖ్యలో హైదరాబాద్‌ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది.

Spread the love