Wednesday, September 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో ఇండ్ల కేటాయింపునకు లాటరీ

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో ఇండ్ల కేటాయింపునకు లాటరీ

- Advertisement -

ఆగస్టు 28 నుంచి 
31 వరకు నిర్వహణ
యూట్యూబ్ ద్వారా 
ప్రత్యక్ష ప్రసారం
వదంతులను నమ్మొద్దు
మధ్యవర్తులకు 
ఆస్కారం లేదు : 
హౌసింగ్ బోర్డు వైస్ చైర్మెన్ 
వి.పి గౌతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో నిర్మించనున్న ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మెన్ విపి గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియనంతటినీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా లాటరీ డ్రా తీసేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్థలాభావం భద్రతా ఏర్పాట్లు తదితర కారణాల వలన లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ అనుమతించలేమని, అయితే, ఆయా కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షంచేలా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్ సైట్ లోనూ, హౌసింగ్ డిపార్ట్ మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ tghd.official తో ఉన్న ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల ద్వారా చూడవచ్చని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం కింద వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించడమే కాకుండా, అనర్హులుగా గుర్తించిన వారి నుంచి అభ్యంతరాలను కూడా తీసుకుని పరిష్కరించినట్టుగా ఆయన తెలిపారు.
​దళారీలకు ఆస్కారం లేదనీ, అపోహలను, వదంతులను నమ్మొద్దని గౌతం ప్రజలను కోరారు. ఇప్పుడు లాటరీలో రాని వారు తదుపరి విడతలో నిర్మించే టవర్స్ అర్హులుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ పథకంలో అనర్హులైన వారు త్వరలో ప్రకటించబోయే ఎంఐజీ హౌసింగ్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మధ్యవర్తలు మాటలు నమ్మొద్దనీ, ఏవైనా సందేహాలుంటే కాల్ సెంటర్ 040 24603572 లో సంప్రదించాలని సూచించారు.

​లాటరీ షెడ్యూల్ ఆగస్తు 28వ తేదీ
కుత్భుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్ లోనూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్ లో, రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి కు చెందిన లాటరీని లక్ష్మీగుడ పొదుపు సంఘం హాల్ లోనూ , నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లోని వెట్స్ గార్డెన్ లో నిర్వహిస్తారు.

ఆగస్టు 29వ తేదీ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాలనీకి సంబంధించిన లాటరీని కుమంరభీం ఆదివాసీ భవన్ సేవాలాల్ బంజారా భవన్ లోనూ, కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్ బి కమ్యూనిటీ హాల్ లోనూ, అంబర్ పేట నియోజకవర్గం లాటరీని మహరాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లోనూ, బహదూర్ పుర నియోజకవర్గం లోని ఎస్ డి ఆర్ పెర్ల్ ప్యాలెస్ లో నిర్వహిస్తారు.

30 వ తేదీ
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని రాయదుర్గం ప్రాజెక్టు లాటరీ ని గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్ర ప్రాంగణంలోనూ, మలక్ పేట నియోజకవర్గానికి చెందిన లాటరీని చంపాపేటలోని సాదియా ఫంక్షన్ హాల్ లో నూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లాటరీని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్ లోనూ, మేడ్చల్ నియోజకవర్గం లాటరీని పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తారు.

31 వ తేదీ
మల్కాజిగిరి కౌకూర్ ప్రాజెక్టు లాటరీ ప్రక్రియను ఆల్వాల్ విబిఆర్ గార్డెన్స్ లోనూ, సనత్ నగర్ పాటిగడ్డ లాటరీని హెవన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లోనూ, మహేశ్వరం జల్ పల్లి ప్రాజెక్టు లాటరీనీ బడంగిపేట్ ప్రజా భవన్ లోనూ, కార్వాన్ కుల్సుంపుర ప్రాజెక్టు లాటరీని నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -