బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు
11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజల పక్షాన నిలుస్తూ సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై నవతెలంగాణ నిష్పాక్షికంగా గళాన్ని వినిపిస్తున్నది. పేదలు, బలహీనవర్గాల సమస్యలను వెలుగులోకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరంతరం ప్రభుత్వాలను నిలదీస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామి విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణకు కట్టుబడి ఉంది. ప్రజా చైతన్యానికి దిక్సూచిగా నిలుస్తోంది. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ పాఠకుల విశ్వాసాన్ని చూరగొంటోంది. నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, పాత్రికేయులకు, సిబ్బందికి శుభాకాంక్షలు.
ప్రజా చైతన్యానికి దిక్సూచి నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



