
మండలంలోని మద్దికుంట శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, ఉత్సవాలకు ఆహ్వానిస్తూ బుధవారం మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ కు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నయీమ్ కు ఆహ్వాన పత్రికను ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ కలిసి అందజేశారు. అందజేసిన వారిలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఎంపీటీసీ రాజేందర్, మాజీ సర్పంచ్ బొమ్మిడి రామ్ రెడ్డి, నాయకులు తోట రాజు, తోటలింగం, బండి ప్రవీణ్, రాతుల రెడ్డి, సాకలి నారాయణ, దులూరి బాలయ్య తదితరులు ఉన్నారు.