
నవతెలంగాణ- మద్నూర్
ఈనెల 29న శుక్రవారం ఉదయం 11:30 నిమిషాలకు మద్నూర్ సింగల్ విండో 53వ మహాజనసభ సంఘ భవనంలో విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన జరుగుతుందని సింగిల్ విండో కార్య నిర్వహణ అధికారి జే బాబురావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మహాజన సభ విజయవంతానికి సంఘం పరిధిలోని సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ మహాజన సభ సమావేశంలో 1-4-2023 నుండి29-9-2023 వరకు జమ ఖర్చుల ఆమోదం ఇతర అంశములు అధ్యక్షుల వారి అనుమతితో చర్చించుకోవడం జరుగుతుందని సభ్యులందరూ సకాలంలో హాజరై మహాజనసభ విజయవంతం చేయాలని కార్యనిర్వాహణ అధికారి విజ్ఞప్తి చేశారు.