Monday, August 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం

నేడు నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం

- Advertisement -

హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
​యాగానికి సర్వం సిద్ధం.. భారీ
 పోలీసు బందోబస్తు
​నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని, రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌ వేదికగా నిర్వహించనున్న మహా వరుణ యాగానికి సర్వం సిద్ధమైంది. సోమవారం నాగార్జునసాగర్‌ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవిహార్‌ ఆవరణలో యాగ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

​108 మంది వేద పండితులతో క్రతువులు
​రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో యాగం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకులు, సిద్ధాంతులు ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహించ నున్నారు. ఇందుకోసం యాగశాలలో ప్రత్యేకంగా 11 హోమగుండాలను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు చెందిన 108 మంది వేద పండితులు, ఋత్వికులు యాగ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ​యాగంలో మహా పూర్ణాహుతి ప్రధాన ఘట్టంగా నిలవనుంది. మధ్యాహ్నం 3.20 గంటల నుంచి 3.24 గంటల మధ్య మహా పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

​భారీ పోలీసు బందోబస్తు
​ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానుండ టంతో నాగార్జునసాగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాగ ప్రాంగణం లో యాగశాల, ప్రవచనశాలతో పాటు సీఎం పర్యటనకు అనుగుణంగా హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లు చేపట్టారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. కాగా, సాగర్‌ తీరంలో నిర్వహించే ఈ మహా క్రతువుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -