మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎట్టి వెంకన్నకు ఇవ్వాలి..

– ఆదివాసి సంఘాల ఐక్యవేదిక
నవతెలంగాణ -తాడ్వాయి :
ఎన్పీడీసీఎల్ డీఈ, విద్యావేత్త ఎట్టి వెంకన్న కు మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానం ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆదివారం మేడారంలో ఆదివాసి ఐక్యవేదిక సంఘాల నాయకులు వనదేవతలకు పూజలు నిర్వహించి మద్దతు తెలిపారు. ఐటీడీఏ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఐక్యవేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావేత్త డిఈ వెంకన్న ఆదివాసి సామాజిక వర్గానికి, ప్రజలకు ఎన్నో సేవలు అందించారని  ప్రజల్లో మమైకమై గ్రామాలలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో కీలక ఉద్యోగంలో ఉంటూ ప్రజలకు ఎననలేని సేవలు అందించారని, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన సేవలు మరువలేనివి అని అన్నారు. ఇలాంటి విద్యావేత్త అయిన ఎట్టి వెంకన్నకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని వన దేవతల సాక్షిగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు పొడెం రత్నం, బాబు, చింత కృష్ణ, అర్రెం లచ్చు పటేల్, సామాజిక న్యాయవేదిక మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, చిడం బాబురావు, ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మడే బిక్షపతి, ఆదివాసి సేన నాయకులు సాయిబాబు, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసి మహిళా నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love