మహాధర్నా కు 12 యూనివర్సిటీ ల సంపూర్ణ మద్దతు…

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోజువారి కార్యక్రమం భాగంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.యూనివర్సిటీలోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వి దత్త హరి పాల్గొని మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ నెల 15న భారీ ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీకి తరలిరావడం ఈ మహాధర్నా విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Spread the love