బీరెల్లి గ్రామాన్ని ఎన్పీడీసీఎల్ డిఈ పుల్సం నాగేశ్వరరావు సందర్శన..

– డిఈని సన్మానించిన సర్పంచ్, గ్రామస్తులు
– పలు విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్
– ఎస్సీ ఎస్టీలు కులం సర్టిఫికెట్లు ఇచ్చి ఉచిత విద్యుత్ పొందగలరు డిఈ 
– సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన డి ఈ నాగేశ్వరరావు 
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బీరెల్లి గ్రామాన్ని ఎన్పీడీసీఎల్ డిఈ పుల్సం నాగేశ్వరరావు, ఏఈ వేణు కుమార్, సబ్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, విద్యుత్ సిబ్బంది తో కలిసి మండలంలోని బీరెల్లి గ్రామాన్ని గురువారం విద్యుత్ శాఖ బృందం పర్యటించారు. ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఈ పుల్సం నాగేశ్వరరావు, తాడ్వాయి మండలం ఏజెన్సీ ప్రాంతంలో గల పంబాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను స్థానిక సర్పంచ్ జాజ చంద్రం, ఉప సర్పంచ్ వంగరి అనసూర్య, గ్రామస్తులతో కలిసి సాదరంగా ఆహ్వానించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. స్థానిక సర్పంచ్ చంద్రం, బీరెల్లి గ్రామపంచాయతీలోని ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామంలోని ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని, ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రదేశానికి మార్పిడి చేయాలని, బీరెల్లి గ్రామంలో 24 కొత్త విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని, బీరెల్లి ఎస్సీ కాలనీలో బొర్రయ్య ఇంటి పైనుండి విద్యుత్ లైన్ ఉండడంతో దాన్ని మార్చాలని కోరారు. అంతేకాకుండా బీరెల్లి గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని, పూజారి సమ్మయ్య ఇంటి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచాలని కోరారు. గ్రామాల్లో ఉన్న పలు విద్యుత్ సమస్యలు డి ఈ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్పీడీసీఎల్  డిఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లోని ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మిడిల్ పోల్స్ వెంటనే వేయాలని ఏఈ, తదితర విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ వారు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ప్రభుత్వం నుండి ఉచితంగా విద్యుత్ పొందవచ్చునని, వెంటనే ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు అందించాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్, సబ్ ఇంజనీరింగ్ జ్ఞానేశ్వర్, ఉప సర్పంచ్ వంగరి అనసూయ సదానందం, టిఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ పోగు నాగేష్, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love