ఈ నెల 9న చలో ఉస్మానియా

– రాష్ట్ర యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల మహాసదస్సు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తమను రెగ్యులరైజ్ చేయాలని, న్యాయమైన డిమాండ్ లను నేరవేర్చాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నెల 9న “చలో ఉస్మానియా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్- జాయింట్ యాక్షన్ కమిటీ (UTAC- TS- JAC ) నాయకులు డాక్టర్ ఏ పరశురాం, డాక్టర్ డి ధర్మతేజ, డాక్టర్ వేల్పుల కుమార్, వెంకటేష్ లు తెలిపారు.బుదవారం వారు ఓయూలో సమావేశం నిర్వహించినట్లు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు దత్తాహరి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న చలో ఉస్మానియా పేరుతో ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్57  లో ” కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్” రాష్ట్ర మహాసదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, గౌరవ అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపి రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కే శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పద్మావతి, పాలమూరు యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ రాజారత్నం, ప్రత్యేక ఆహ్వానితులుగా ఓయూ మ్యాథమెటిక్స్ హెడ్ ప్రొఫెసర్ కిషన్, ప్రొఫెసర్ కాసిం, ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ లు వక్తలుగా హాజరవుతారని తెలిపారు. మహా సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ లు హాజరవుతున్నారని జేఏసీ నాయకులు తెలిపారు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు సానుకుల దృక్పథంతో పరిష్కారించలని,ఇదే మా కోరిక ఉందని దత్తాహరి పేర్కొన్నారు.అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Spread the love