25 కోట్ల తో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామాన అభివృద్ధి 

– ₹ 62.75 లక్షల రూపాయలు విలువగల ఎస్ డిఎఫ్ అందజేత
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన కుల సంఘాలు, పలు అలయాల ప్రహరీ గోడల కొరకు మంజూరైన ఎస్ డిఎఫ్ 62.75 లక్షల విలువ గల ప్రోసెడింగ్ పత్రలను సోమవారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివిధ కులాల సంఘ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులు ఎంపిటిసిలకు జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ,ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 44 కోట్లు ఎస్ డిఎఫ్,సిడిపి నిధులతో చాలావరకు కమ్యూనిటీ హాళ్ళను నిర్మించుకోవడం జరిగిందని ,ఇంకా అవుసరం ఉన్న చోట జరుగుతున్నాయని వివరించారు. ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామ  గ్రామాన సిసి రాహదరులు, డ్రైనేజీల నిర్మాణం జరిగాయని ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. ఇందల్ వాయి మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన ఎస్ డిఎఫ్ నుండి మంజూరైన వివరాలు ఎల్లారెడ్డి పల్లె గ్రామంలో మొట్టటి రెడ్డి సంఘానికి  ₹ 5 లక్షలు, గోసంగి సంఘానికి  ₹ 5 లక్షలు, గ్రామంలో ఓఆర్ సి వర్క్  ₹ 2.25 లక్షలు,  ఓఆర్ సి వర్క్  ₹ 4 లక్షలు, మేఘ్య నాయక్ తండ గ్రామంలో  మహిళా భవనం నిర్మాణం కు  ₹ 2.50 లక్షలు, ఇందల్ వాయి గ్రామంలో పెద్ద చెరువు మరమ్మతులకు  ₹ 5 లక్షలు, సౌమ్య నాయక్ తండ గ్రామంలో కమ్యూనిటీ హాల్  ₹ 5 లక్షలు, గుడి తండా గ్రామంలో సేవలాల్ మహారాజ్ అలయ ప్రహరి గోడ నిర్మాణం  ₹2 లక్షలు, బాదావత్ సర్దార్ ఇంటి నుండి సిసి రాహదరికి ₹3 లక్షలు,  చంద్రాయన్ పల్లి గ్రామంలో రామాలయం కాంపౌండ్ వాల్ కు  ₹ 3 లక్షలు, కమ్యూనిటీ హాల్ ₹ 5 లక్షలు, నల్లవెల్లి గ్రామంలో  పెద్దమ్మ ఆలయం కు  ₹ 3 లక్షలు,  గ్రామ పంచాయతీ ముఖ ద్వారం వెల్కమ్ వెల్కమ్ బోర్డుకు ₹3 లక్షలు, త్రియంబక్ పేట్ గ్రామంలో విలేజ్ కమ్యూనిటీ హాల్ ₹ 10 లక్షలు రూపాయల ఎస్ డిఎఫ్ ప్రోసిడింగ్ పత్రాలను వివిధ కులాల సంఘ సభ్యులకు, సర్పంచులు ఎంపిటిసిలకు, ప్రజాప్రతినిధులకు  పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ బుసని అంజయ్య,బిఅర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలివేరి దాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పాశంకుమార్, లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, మహిళ విభాగం మండల అధ్యక్షులు పులి వసంత సాగర్, తహసిల్దార్ టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ఉప సర్పంచులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కుల సంఘాల నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love