బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నవతెలంగాణ- బడంగ్‌పేట్‌
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం రూ. కోట్ల నిధులు మంజూరు చేయడంతో వాటిని వివిధ అభివృద్ధి పనుల కోసం ఎలా ఉపయోగించాలో మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రహీం, శేఖర్‌, కార్పొరేటర్లతో కలిసి మంత్రి ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పట్టణ ప్రగతిలో భాగంగా సమీకతా మార్కెట్‌, వైకుంఠ దామాల నిర్మాణం, స్వచ్ఛతకు చిరునామాలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తీర్చిదిదేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. రూ.1200కోట్లతో నాళాల అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో రూ.110కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీటి సమస్య లేకుండా రూ.210కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గుర్రం గూడ, కూర్మల్‌ గూడ, జిల్లెల గూడ, బడంగ్‌పేట్‌లలో రిజర్వాయర్ల పనులు జరుగుతు న్నాయన్నారు. బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లిల పరిధిలోని 10 చెరువులలో రూ.40కోట్లలతో అభివద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.12లక్షలతో సాయి బాలాజీ టౌన్‌ షిప్‌-2లో పైప్‌ లైన్‌ పనులకు, రూ.12 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, మరో రూ.15లక్షలతో ఎస్‌డబ్ల్యూ పైప్‌ లైన్‌, సీసీ రోడ్ల, అదేవిధంగా 3వ డివిజన్‌లో ఆర్‌ఎంఆర్‌ కాలనీలో రూ.64లక్షలతో నిర్మించే స్ట్రామ్‌ వాటర్‌ పైప్‌లైన్‌ పనులకు, రూ.2కోట్లలతో 1, 2, 3, 20వ డివిజన్ల పరిధిలో అయ్యంగార్‌ బేకరీ నుండి అల్మాస్‌ గూడ వరకు బీటీ రోడ్డు పనులకు, 23, 28, 25, 24, 3, 2వ డివిజన్ల పరిధిలోని మారతీనగర్‌ నుండి అల్మాస్‌గూడ వరకు రూ.2 కోట్లలతో చేపట్టే బీటీ, సీసీ రోడ్డు పనులకు, 2వ డివిజన్‌లో రూ.30లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు, మరమ్మత్తు పనులకు, రూ.11లక్షలతో ఎస్‌ఎస్‌ఆర్‌ కాలనిలో బీటీ, సీసీ రోడ్డు పనులకు, రూ.2కోట్లా 50 లక్షలతో కోమటికుంట చెరువు సుందరీకరణ పనులకు, 4వ డివిజన్‌లో బీఆర్‌ఆర్‌ కాలనీలో రూ.20లక్షలతో సీసీ రోడ్డు పనులకు, రామిడిహిల్స్‌లో రూ.10లక్షలతో సీసీ రోడ్డుకు, రూ.కోటీ 30లక్షలతో 4, 5, 26వ డివిజన్ల పరిధిలో సబ్‌ స్టేషన్‌ నుండి శ్రీహిల్స్‌ కాలనీ వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు, రూ.1 కోటి నిధులతో మాత గుడి నుండి స్వేచ్ఛ నివాస్‌ వరకు 4,5 డివిజన్ల పరిధిలో నిర్మించిన రోడ్డును, డివిజన్‌ నంబర్‌ 4 లో రూ.12 లక్షలతో వెంకటేశ్వర కాలనీలో చేపట్టిన పైప్‌ లైన్‌ పనులకు, సౌభాగ్య నగర్‌లో రూ.22 లక్షలతో ఎస్‌ డబ్ల్యూ పైప్‌ లైన్‌ పనులకు, మధుర పూరిలో రూ. 60 లక్షలతో వేసిన పైప్‌ లైన్‌ పనుల ప్రారంభం, డివిజన్‌ 4లో రూ. 2 కోట్లతో పోచమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love