తూర్పాటి మహేష్ కు మహానంది జాతీయ పురస్కారం

నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని బుడిగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి మహేష్  వాస్తు,జ్యోతిష్య శాస్త్రలలో అత్యంత ప్రతిభ కనబర్చినందుకు  మహానంది జాతీయ పురస్కారంతో బాటు””వాస్తు విద్యా విభూషణ్ “”అనే బిరుదు పురస్కారం అందుకున్నారు.ఈ నెల11న విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు సాంస్కృతిక సాహితీసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు ,వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గౌరీ శంకర్ పలువురు ప్రజా ప్రతినిధులు,సాహితీ, ఆధ్యాత్మిక, సామాజిక సేవకుల సమక్షంలో  రెండు పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణం లోని భార్గవపురం సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో శిశు మందిర్ పాఠశాలలో తూర్పాటి మహేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిట్టి గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి , కార్యదర్శి దొడ్డి శ్రీను, రమాదేవి, ఉపధ్యాయినులు  దేవరాజు,జగదీశ్వర్ ,చంద్రమౌళి,లక్ష్మయ్య,సుధాకర రావు, రమేష్,మల్లేశం, దాక్షాయని తదితరులు పాల్గొన్నారు.
Spread the love