Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయథాతథస్థితి కొనసాగించండి

యథాతథస్థితి కొనసాగించండి

- Advertisement -

బహదూర్‌గూడ భూములపై హైకోర్టు ఆదేశం ​ ​
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మం డలం బహదూర్‌గూడ సర్వే నెంబర్‌.28, 62 లోని భూముల వ్యవ హారంలో హక్కుల వివాదం ఉందనీ, అందువల్ల తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా యథాతథస్థితి కొనసాగిం చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైన చర్యలు తీసుకోవాలనుకుంటే చట్టప్రకారమే ఉండాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ నెల 18న పోలీసులు, రెవెన్యూ అధికారులు నివాసాలను కూల్చివేసి బలవంతంగా ఖాళీ చేయిం చడాన్ని సవాలు చేస్తూ కృష్ణమో హన్‌రాజు సహా వంద మంది రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు చెందిన 48 ఎకరాలకు కంచె వేయ డాన్ని సవాలు చేస్తూ ముస్తాంగ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ వేర్వేరుగా రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది హనుమంతరావు వాద నలు వినిపిస్తూ రైతుల ఇండ్లను అధి కారులు విచక్షణారహితంగా కూల్చి వేశారని తెలిపారు. రైతులపై దాడి చేయ డానికి ప్రభుత్వం రహదారి వేసిన ట్లుందన్నారు. మహిళలని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. కూల్చివేయడానికి ముందున్న పరిస్థి తిని పునరుద్ధరించాలని ఆదేశిం చాలన్నారు. ఆస్తుల ధ్వంసం, మానసిక వేదనకు గురి చేసినందుకు ఒక్కో రైతుకు నష్టపరిహారంగా రూ.2 కోట్లు ఇప్పించాలని కోరారు. ఈ సంఘటనపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శ న్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టామనీ, భూమిపై పిటిషనర్లకు హక్కులు లేవ న్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇది భూములపై హక్కులకు సంబంధిం చించిన తీవ్రమైన వివాదాస్పద అంశా లున్నందున పిటిషనర్ల హక్కుల రక్షణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసేదాకా యథాతథస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -