Saturday, September 19, 2026
E-PAPER
Homeజాతీయంరాష్ట్రపతి ఏడీసీగా మేజర్ నవ్య షెకావత్ నియామకం

రాష్ట్రపతి ఏడీసీగా మేజర్ నవ్య షెకావత్ నియామకం

- Advertisement -

తొలి మహిళా 
ఆర్మీ అధికారిగా రికార్డు
న్యూఢిల్లీ: రాజస్తాన్ కు ప్రాంతానికి చెందిన మేజర్ నవ్య షెకావత్ రాష్ట్రపతి ఏడీసీగా నియామకమయ్యారు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి ఆర్మీ మహిళా అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు. దేశంలో రాష్ట్రపతికి ఏడీసీగా నియమితులైన రెండో మహిళా అధికారిగా నిలిచారు. 2025లో ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆర్మీ నుంచి నవ్య షెకావత్ ఆ గౌరవాన్ని దక్కించుకున్నారు. జులై 2026లో ఈ నియామకం జరగ్గా, ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి భవన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆమె కుటుంబం ​మూడు తరాలు సైన్యంలోనే
మేజర్ నవ్య షెకావత్‌ది పూర్తిగా సైనిక కుటుంబం. సికార్ జిల్లాలోని చిన్న గ్రామమైన కేర్పురాకు చెందిన నవ్య కుటుంబం మూడు తరాల వారు సైన్యంలో పనిచేశారు. ఆమె తాత భన్వర్ సింగ్ షెకావత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి గ్రూప్ కెప్టెన్ కరణ్ సింగ్ షెకావత్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లోనే ఉన్నత హోదాలో సేవలు అందిస్తున్నారు. మూడో తరమైన నవ్య ప్రస్తుతం ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు.

​సీడీఎస్ పరీక్ష ద్వారా సైన్యంలోకి ప్రవేశం
నవ్య తన స్కూలు, కాలేజీ చదువులు పూర్తి చేసిన తర్వాత సైన్యంలో సేవలందించాలని అనుకున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కఠినమైన యూపీఎస్సీ ‘సీడీఎస్’ పరీక్షను రాశారు. తొలి ప్రయత్నంలోనే ఆ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. ఆ తర్వాత చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ’లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత 2021వ సంవత్సరంలో ఆమెకు భారతీయ సైన్యంలోని ‘ఆర్మీ సర్వీస్ కార్ప్స్’ విభాగంలో అధికారిగా అవకాశం లచించింది. ఈ విభాగం సైన్యానికి కావాల్సిన ఆహారం, వస్తువులు, రవాణా, ఇతర ముఖ్యమైన సహాయాలను అందిస్తుంది. ఈ శాఖలో అంకితభావంతో పనిచేస్తూ కేవలం ఐదేండ్ల లోనే మేజర్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి భవన్ వరకు వెళ్లి దేశం దృష్టిని ఆకర్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -