మాలల మహధర్నాను విజయవంతం చేయాలి 

– మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి 
ఈ నెల 14న జాతీయ మాల మహానాడు అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మాలల మహాధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాసూరి మల్లికార్జున్ గురువారం పిలుపునిచ్చారు.ఉపాధిలేని మాలలకు దళిత బందు, గృహలక్ష్మి పథకంలో సమన్యాయం, హైదరబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టు అన్యక్రాంతమైన దళితుల భూములతో పాటు దళితుల అన్ని రకాల భూములను యథావిధిగా తిరిగి అందజేయాలని, మాలల రాజకీయ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఏర్పాటుచేసి హైదరబాద్ నడిబోడ్డున మాలల భవనానికి ఐదేకరాల భూమిని కేటాయించాలనే డిమాండ్లతో తలపెట్టిన మాల మహానాడు మహాధర్నాకు మాలలు, యువత, మేథావులు పెద్ద సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని రాసూరి మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు.
Spread the love