మోడీపై మల్లిఖార్జున ఖర్గే తీవ్ర విమర్శలు..

నవతెలంగాణ – ఢిల్లీ: గత 10 ఏండ్ల మోడీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్  చేశారు మల్లికార్జున ఖర్గే.  మోడీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందని, గతంలో జబల్ పూర్ విమానాశ్రం పైకప్పు పడిపోయిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని అన్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు ఏర్పాడ్డాయన్నారు. 2023 – 24లో బీహార్ లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జి కూలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలన్నీ ప్రధాని 10 ఏండ్ల పాలనకు నిదర్శనమన్నారు.

Spread the love