సమ సమాజ స్థాపన కై చివరివరకు పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం

– మూడవ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) నివాళి

నవతెలంగాణ కంఠేశ్వర్ 
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి కార్యక్రమం సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయటానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలని చంతో సీపీఐ(ఎం) పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల దురగాథలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కష్టజీవులను కదిలించి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ధీరవనిత అని భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రజలను సంఘటిత పరిచారని దోపిడి లేని సమసమాజ నిర్మాణమే ఆమెకు సరైన నివాళి అని ఆయన అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మనువాద ఆలోచనలు ఉన్న కాలంలో మహిళా అబల కాదు సబలా అని నిరూపించారని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అనేకమంది మహిళలు పోరాటాల్లోకి వచ్చారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ.. భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని ఆమె చూపిన బాటలో పయనించినప్పుడే దోపిడీ లేని సమ సమాజం ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా నాయకులు నగర నాయకులు కటారి రాములు, అనిత, తదితరులు పాల్గొన్నారు.
Spread the love