అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ

నవతెలంగాణ -ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఈ అరెస్టును ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని, ఇది చాలా దారుణమని విమర్శించారు. అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ లేదా ఈడీ దర్యాఫ్తు చేస్తున్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉంటే మాత్రం వారికి శిక్షపడదని ఆరోపించారు. ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్నప్పుడు దర్యాఫ్తు సంస్థలు వెంటబడతాయని… బీజేపీలో చేరిన తర్వాత ఎలాంటి శిక్ష ఉండదన్నారు. ఇలాంటి వైఖరిని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Spread the love