మామిడిపల్లి పాఠశాల అంతర్జాతీయ బాలికల దినోత్సవ ర్యాలీ

నవతెలంగాణ ఆర్మూర్ :

అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా బుధవారం పట్టణంలోని మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థినులచే అవగాహన ర్యాలీ నిర్వహించినారు. బాలికలకు పోషకాహారం, మంచి అలవాట్లు చిన్ననాటి నుండే అలవర్చుకోవాలని, బాల్యవివాహాల నివారణ ల పై అవగాహన కల్పించి, బాలికా లతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ జ్యోతి, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ, అంగన్వాడి టీచర్లు జగదాంబ, సంగీత, శైలజ, గోదావరి, లక్ష్మి, మహిళ శక్తి యువజన కౌన్సిలర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు .
Spread the love