నవతెలంగాణ-లక్షెట్టిపేట
పురుగుల మందు తాగి వ్యక్తి మండలోని ఎల్లారం గ్రామానికి చెందిన మొగిలి(46) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ పి సతీష్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలి వృత్తి రిత్య ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేశాడు. అవి కట్టలేక మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదిన సాయంత్రం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరళించారు. పరిస్తితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరళించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య మమత పిర్యాదు మేరకు ఎస్‌ఐ-2 రామయ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.