ప్రమాదవశాత్తు క్రిందపడి వ్యక్తి మృతి

నవతెలంగాణ – రామారెడ్డి
ప్రమాదవశాత్తు వ్యక్తి క్రిందపడి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన నామాపురం శ్రీనివాస్ ((41,) భార్య చనిపోవడంతో, పిల్లలు లేకపోవడంతో, ఇంట్లో ఒక్కడే జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు క్రిందపడి రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందగా, గురువారం రాత్రి చుట్టుపక్కల వారు, తల్లి చూసేసరికి మృతి చెందాడని తల్లి నామపురం నర్సవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కొండ విజయ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్త కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Spread the love