మంచు విష్ణు కన్నప్ప టీజర్ విడుదల..

నవతెలంగాణ- హైదరాబాద్: టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల కన్నప్ప టీజర్ ను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. నేడు ఈ టీజర్ ను భారత్ లో విడుదల చేశారు. అయితే, యూట్యూబ్ లో కాకుండా, కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోనే ప్రదర్శితమయ్యేలా కన్నప్ప టీజర్ ను విడుదల చేశారు. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మధుబాల వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. కన్నప్ప చిత్రం అత్యధిక భాగం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంది.

Spread the love