‘పుష్ప 2’ టీజర్ విడుదల..

నవతెలంగాణ -హైదరాబాద్: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు సెలబ్రిటీలు బ‌న్నికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ న‌టిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ ఈ సినిమాకు లెక్కల మాస్టార్‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కన్నడ భామ రష్మిక మందన్నామ‌రోసారి ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ సినిమా నుంచి నేడు బ‌న్ని బ‌ర్త్ డే కానుక‌గా టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స‌మ‌యం రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. గంగ‌మ్మ తల్లి జాత‌రలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ఫైట్ సీన్‌తో ఫుల్ యాక్ష‌న్ ప్యాక్ట్‌డ్‌గా సాగింది ఈ టీజ‌ర్. ఇక నెట్టింట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నా టీజ‌ర్‌ను మీరు చూసేయండి.

Spread the love