జోరుగా ఇంటింటి ప్రచారం చేస్తున్న మండల ఎంపీపీ  సూడి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట: మండల ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి కారు గుర్తుకు ఓటేయాలంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం మండలంలోని  వస్రా గ్రామపంచాయతీ పరిధిలో అభ్యుదయ కాలనీ[11]వ వార్డులో ఉన్న గడప గడపకు తిరుగుతూ ఓటర్లతో ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ రాముడిలా ఉన్నాయి. విశ్వాసం లేని పార్టీల మాటలు ప్రజలు నమ్మరు. మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ నాయకత్వం ఎగరడం ఖాయంఅని  గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని అన్నారు. విశ్వనియత లేని పార్టీల మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని గోవిందరావుపేట మండలం ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. నవంబర్30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి బడే నాగజ్యోతి అక్కను  భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాలలో ప్రచారం చేస్తున్న క్రమంలోప్రజల నుంచి విశిష్ట స్పందన లభిస్తుందని తెలిపారు. విజ్ఞులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా, మోటర్లకు మీటర్లు అంటున్న బీజేపీ కావాలా, 24గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న బీఆర్‌ఎస్‌ కావాలా తేల్చుకొని ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, విద్య సమదృష్టితో పరిపాలన చేస్తున్న కేసీఆర్ కి మూడోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ ఎన్నికలు కేవలం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం కాదు, రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి జరిగే ఎన్నిక, నిరుపేద విధ్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే ఎన్నిక, వ్యవసాయాన్ని పండగల చేస్తున్న రైతుకు వెన్నుదన్నుగా నిలిచే ఎన్నిక అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మన కేసీఆర్  ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఇచ్చే ఓటుతో రేపు అధికారంలోకి రాగానే : రైతుబంధు రూ.16,000/- మొదటి ఏడాదినుంచే రూ॥ 12,000/- దశలవారిగా ఐదేండ్లలో రూ॥ 16,000/-లకు పెంపు.. కేసిఆర్ భీమా… ప్రతి ఇంటికి భీమా రూ॥ 5 లక్షల బీమా ప్రతి కుటుంబానికి రూ॥ 5లక్షల బీమా సౌకర్యం తెల్ల రేషన్ కార్డున్న 93 లక్షల కుటుంబాలకు లబ్ధి… అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్నబియ్యం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా… గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల నేపథ్యంలో పేద కుటుంబాలకు రూ 400కే వంట గ్యాస్ సిలిండర్… పేదలకు ఇండ్ల స్థలాలు రాష్ట్రంలోని ఇంటి జాగలేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు సమకూర్చనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ప్రతి నియోజక వర్గానికి “ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదలు కోసం గురుకుల నిర్మాణం. ఆసరా పెన్షన్ 5,016/- దివ్యాంగులకు 6,000/- దశల వారీగా పెంపుదల మొదటి ఏడాది రూ 3,016/- అందజేత. కేసిఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు ‘అర్హులైన పౌరులందరికీ ప్రస్తుతం అందిస్తున్న ఆరోగ్య బీమా పరిమితిని రూ॥ 15 లక్షలకు పెంపు.. సౌభాగ్యలక్ష్మి రూ॥ 3,000 అర్హులైన పేద కుటుంబాల మహిళలకు జీవనభృతి.. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు దశల వారీగా రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణం. అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్యం ” హక్కుల కల్పనకు కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ శ్యామల జ్యోతి సమ్మిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి, వరదం చందర్ రాజు, సామ వెంకటరెడ్డి, సుడి మోహన్ రెడ్డి, సుడి సతీష్ రెడ్డి, ఎల్లావుల శేఖర్, ముక్కల కుమార్, పసుమర్తి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love