నవతెలంగాణ-కమ్మర్ పల్లి : ధర్మ సమాజ్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపేట్ మండలం నూత్ పల్లి గ్రామానికి చెందిన మంగ్లారం మహిపాల్ బరిలో నిల్వనున్నారు. ఈ మేరకు సోమవారం ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ మంగ్లారం మహిపాల్ ను బాల్కొండ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంగ్లారం మహిపాల్ మాట్లాడుతూ ధర్మ సమాజ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలంతా టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. నియోజకవర్గoలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభిముఖంగా ధర్మ సమాజ్ పార్టీ పోటీలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమేష్(మోర్తాడ్), మహేష్(వేల్పూర్), నాయకులు సతీష్, నిశాంత్, సాయి, క్రాంతి, రంజీత్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.